AP: విశాఖపట్నంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గాజువాకలోని ఓం జ్యూవెలరీ, పెందుర్తిలోని వెంకటేశ్వర జ్యూవెలరీలో చోరీకి ముఠా సభ్యులు పథకం రూపొందించారు. కస్టమర్లుగా వచ్చి ఆభరణాలను కొప్పులో, చీరల్లో దాచి పారిపోయేందుకు ప్రయత్నించారు. సిబ్బంది వెంటనే సమాచారం ఇవ్వడంతో రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని పోలీసులకు అరెస్ట్ చేశారు.