ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే.. ఈ సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్ ఏంటి? అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమానే ఉంటుందని అంటున్నారు.
Allu Arjun-Trivikram: వాస్తవానికైతే.. ‘పుష్ప2’ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేట్ కావడంతో డిసెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నారు. మరో 30 రోజులు ‘పుష్ప2’ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగతో కమిట్ అయ్యాడు ఐకాన్ స్టార్. సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రభాస్ ‘స్పిరిట్’ తర్వాతే ఉంటుంది.
కాబట్టి.. నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమానే ఉండాలి. అయితే.. ఈ మధ్యలో అట్లీ లైన్లోకి రావడంతో.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిందని అన్నారు. కానీ అట్లీ సినిమా క్యాన్సిల్ అయింది. అయితే.. ఇప్పుడు జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో బన్నీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. కాబట్టి.. అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. 2025 సమ్మర్లో త్రివిక్రమ్ సినిమా మొదలుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
షూటింగ్‌కు ఏడాదిన్నర సమయం పట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతేకాదు.. ఈ సినిమాను ‘కల్కి’కి మించి భారీగా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఇప్పటి వరకు రీజనల్ లెవల్లోనే సినిమాలు చేసిన మాటల మాంత్రికుడు.. బన్నీతో ఫస్ట్ టైం మైథలాజికల్ టచ్‌తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. 2027లో బన్నీ, త్రివిక్రమ్ సినిమా రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది.