ADB: భుక్తాపూర్ సబ్ స్టేషన్లో మరమ్మతుల దృష్ట్యా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యానగర్, భుక్తాపూర్, సినిమా రోడ్, రాణి సతీజీ కాలనీ, ద్వారకనగర్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సదానందం తెలిపారు. అత్యవసర పనుల వల్ల జరుగుతున్న అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.