డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ హీరో రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' రిజల్ట్ చాలా కీలకంగా మారింది. కానీ ఈ సినిమాకు ఏకంగా నాలుగు సినిమాలు పోటీ ఇస్తున్నాయి. మరి డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉండబోతోంది?
Double Ismart: 4 movies to compete with 'Double Ismart'?
Double Ismart: ‘కల్కి’ తర్వాత రాబోతున్న సినిమాల్లో.. డబుల్ ఇస్మార్ట్ పై మంచి అంచనాలున్నాయి. ఇస్మార్ట్ శంకర్‌కు మించిన హిట్ అందుకోవడానికి ఆగష్టు 15న రాబోతున్నారు పూరి జగన్నాథ్, రామ్. అయితే.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు గట్టిపోటీ ఏర్పడింది. వాస్తవానికైతే.. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ అయి ఉంటే.. ఈ సినిమాలు మరో డేట్‌ను వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ పుష్ప 2 డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ అవడంతో.. ఆగష్టు 15న ఏకంగా 5 సినిమాలు థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
తెలుగు నుంచి తీసుకుంటే.. నివేదా థామస్ లీడ్ రోల్లో నటించిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా ’35 చిన్న కథ కాదు’.. ఆగష్టు 15న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహించగా.. దగ్గుబాటి రానా నిర్మించారు. ఇక నార్నె నితిన్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంట్రటైనేర్ ‘అయ్’ మూవీ అదే రోజు రాబోతోంది. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ కథాంశంతో ఈ మూవీ సిద్ధమైంది. అంజిబాబు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. బన్నీ వాస్ నిర్మించారు.
వీటితో పాటు చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘తంగలాన్’ ఆగష్టు 15న రిలీజ్ అవుతోంది. పీరియాడిక్ జోనర్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ రేసులోకి రావడానికి.. మాస్ మహారాజా రవితేజ కూడా రెడీ అవుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీని ఆగష్టు 15న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి.. డబుల్ ఇస్మార్ట్‌కు గట్టి పోటీ తప్పదనే చెప్పాలి. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలి.