Kalki 2898 AD: Reduced 'Kalki' Collections.. But Sensation!
Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడి’ సినిమా నాలుగో వారంలో కూడా దూసుకుపోతోంది. ఇప్పటికే వెయ్యి కోట్లు రాబట్టిన కల్కి.. 1100 కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన కల్కి.. మరో ల్యాండ్ మార్క్‌ను రీచ్ అయ్యేలా ఉంది. ఇటీవల వచ్చిన భారతీయుడు 2కి నెగెటివ్ టాక్ రావడంతో.. కల్కికి తిరుగులేకుండా పోయింది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు కూడా కల్కి కలెక్షన్స్‌ను డ్రాప్ చేయలేకపోయాయి. అసలు ఈ మూడు వారాల్లో కల్కికి పోటీ ఇచ్చే సినిమా ఒక్కటి కూడా రాలేదు.
ఇది కూడా చూడండి: Jharkhand : లాఠీలతో తుక్కుతుక్కుగా కొట్టుకున్న పోలీసులు
హిందీలో.. అక్షయ్ కుమార్ ‘సర్ఫిరా’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆడియెన్స్ మాత్రం థియేటర్లకు వెళ్లడం లేదు. అయితే.. బాలీవుడ్లో ఈ వారం రిలీజ్ అయిన ‘బ్యాడ్ న్యూస్’ మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. విక్కీ కౌశాల్, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన ఈ సినిమాతో.. కల్కి వసూళ్లు కాస్త తగ్గినా.. హిందీలో మాత్రం సెన్సేషనల్ మార్క్‌కు చేరువలో ఉంది. ఇప్పటి వరకు హిందీ బెల్ట్‌లో కల్కి సినిమాకి 270 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. దీంతో.. ఈ ఏడాదిలో బాలీవుడ్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కల్కి నిలిచింది.
ఇది కూడా చూడండి: Tamanna Bhatiya: బ్లాక్ లెహంగాలో పిచ్చెక్కిస్తున్న మిల్కీ బ్యూటీ
అంతేకాదు.. లాంగ్ రన్లో హిందీలో 275 కోట్లకు పైగా రాబట్టి.. సంచలనంగా నిలిచేలా ఉంది కల్కి. ఇదే జరిగితే.. అక్కడ ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలైనట్టేనని అంటున్నారు. ఏదేమైనా.. బాహుబలి 2 తర్వాత ఏడేళ్ల నిరీక్షణకు.. కల్కి రిజల్ట్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. అన్నట్టు.. నెక్స్ట్ రానున్న సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలు వెయ్యి కోట్లకు పైగా రాబట్టడం గ్యారెంటీ.

