టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. అయితే గత కొద్దికాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఈ హీరో. తాజాగా మరో కొత్త సినిమా మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు శర్వా.
Sharwanand: గతేడాది వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఆ తర్వాత చేసిన ‘ఒక ఒక జీవితం’ సినిమాతో మాత్రం పర్వాలేదనిపించుకున్నాడు. ఆ తర్వాత రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు శర్వానంద్. ఇక పెళ్లి తర్వాత యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘మనమే’ అనే సినిమా చేశాడు. శర్వా కెరీర్లో 35వ సినిమాగా వచ్చిన ‘మనమే’ పర్వాలేదనిపించుకుంది. కానీ శర్వానంద్‌కు ఈ రిజల్ట్ సరిపోదు. ఇప్పటికే రేసులో వెనకబడిపోయాడు శర్వా. అతనికి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ కావాలి. అందుకే.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
అందుకే.. మరోసారి ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ బ్యానర్లో రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు వంటి సినిమాలు చేశాడు శర్వానంద్. ఈ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే.. ఇప్పుడు మరోసారి ఈ బ్యానర్లో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు శర్వా. ఈ సినిమాతో అభిలాష్ అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని.. అందుకే ‘రేస్ రాజా’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. అలాగే.. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటించనుందని టాక్. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. మరి ఈసారి యూవీ క్రియేషన్స్ వారు, శర్వానంద్ కలిసి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.