Kriti Shetty: షాకింగ్.. కృతి శెట్టి చివరి సినిమా ఇదేనా?
యంగ్ బ్యూటీ కృతి శెట్టి స్పీడ్‌కు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తుందని అనుకున్నారు. కానీ తక్కువ కాలంలో ఎంత పాపులారిటీ అయితే సొంతం చేసుకుందో.. ఊహించని విధంగా అంతే స్పీడ్‌లో ఫేడవుట్ స్టేజీకి చేరుకుంది అమ్మడు.
Kriti Shetty: చెప్పాలంటే.. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోయిన్లలో కృతిశెట్టికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో.. కృతి శెట్టి కెరీర్ పీక్స్‌కు వెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కృతిని కాపాడలేకపోయాయి. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి.. అదే స్పీడ్‌లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకుంది. దీంతో కృతి శెట్టికి ఆఫర్లు అరకొరగానే వస్తున్నాయి. ప్రస్తుతం కృతి చేతిలో మూడు తమిళ సినిమాలు ఒక మలయాళ సినిమా మాత్రమే ఉంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. రీసెంట్గా శర్వానంద్ సరసన నటించిన ‘మనమే’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది.
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, కృతికి ఆఫర్లు తెచ్చిపెట్టేలా లేదు. ప్రస్తుతానికైతే కృతికి తెలుగులో ఇదే చివరి సినిమా అన్నట్టుగా ఉంది. టాలీవుడ్ హీరోలు అమ్మడికి ఛాన్స్ ఇవ్వకపోతే.. ఇక పై తెలుగు సినిమాల్లో కృతి కనిపించదా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. కానీ కృతి మాత్రం తెలుగు ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో.. రెమ్యూనరేషన్ తగ్గించడానికి కూడా రెడీగా ఉందట. ఉప్పెన హిట్‌తో కోటి దాకా అందుకున్న కృతి.. ఇప్పుడు రెమ్యునరేషన్ది ఏముందిలే.. మంచి ఛాన్స్ ఇస్తే చాలనే ఆలోచనలో ఉందట. అంతేకాదు.. గ్లామర్ ట్రీట్ ఇవ్వడానికి కూడా సై అంటోందట. మరి.. ఇప్పటికైనా కృతికి టాలీవుడ్లో ఛాన్స్‌లు వస్తాయేమో చూడాలి.