Maname Movie Review: మనమే మూవీ రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా.?
ఎండకాలంలో పెద్ద సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి. ఇప్పుడు వరుసగా వస్తున్నాయి. అందులో యంగ్ హీరో శర్వానంద్ నటించిన మనమే చిత్రం ఈ వారం థియేటర్లోకి వచ్చింది. ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. మరీ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
యంగ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి నటించిన మనమే చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో వస్తుంది అంటే చాలా మందిలో ఆసక్తి పెరిగింది. ఇన్ని అంచనాల నడుమ విడుదలైన మనమే చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
విక్రమ్(శర్వానంద్) లండన్‌లో మాస్టర్స్ పూర్తి చేసి జల్సా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఆయను అనాథైన అనురాగ్ (త్రిగుణ్) చిన్నప్పటి నుంచి మిత్రుడు. అనురాగ్ ప్రేమించిన అమ్మాయితో లండన్‌లోనే పెళ్లి చేస్తాడు విక్రమ్. కొన్నాళ్లకు అనురాగ్ తన ఫ్యామిలీతో ఇండియాకు వెళ్తారు. అక్కడే ఓ ప్రమాదంలో భార్యభర్తలు మరణిస్తారు. దాంతో వాళ్ల కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) అనాథగా మారుతాడు. అతని సంరక్షణ బాధ్యతున సుభద్ర (కృతి శెట్టి)తో కలిసి విక్రమ్ తీసుకుంటాడు. ఆ బాబును పెంచే ప్రాసెస్‌లో విక్రమ్, సుభద్రలకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎంటి? కార్తీక్ (శివ కందుకూరి) పాత్ర ఏంటి? జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్) పాత్రేంటి? తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
ఏ సంబంధం లేని ఓ యువ జంట అనుకోని పరిస్థితుల్లో ఒక బాబును పెంచాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ ప్రయాణం వాళ్లిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది కథ. దీనికి కామెడీ, బలమైన భావోద్వేగాల్ని కలిపి దర్శకుడు శ్రీరామ్ ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. సెకండ్ ఆఫ్ మొత్తం ఎమోషనల్ జర్నీగా సాగుతుంది. ఈ చిత్రంలో విక్రమ్‌గా ఆయన పాత్ర మెప్పించింది. దర్శకుడు కథలోకి తీసుకెళ్లడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు.
ఖుషి బాధ్యతల్ని విక్రమ్, సుభద్ర తీసుకున్న దగ్గర్నుంచి కథలో కామెడి మొదలవుతుంది. పిల్లాడ్ని చూసుకోవడానికి విక్రమ్ పడే అవస్థలు, అతనికి ఎదురయ్యే సవాళ్లు వీళ్లిద్దరి వలన సుభద్రకు ఎదురయ్యే సమస్యలు వీటి మధ్య వెన్నెల కిషోర్ ఎపిసోడ్ చాలా నవ్వు తెప్పిస్తుంది. సినిమా ప్రారంభంలోనే సుభద్రకు పెళ్లి కుదిరినట్లు చెప్పడంతో ఆ తరువాత విక్రమ్, సుభద్రల లవ్ జర్నీ ఎలా సాగుతుంది అనేది ఆసక్తి కలుగుతుంది. కాకపోతే ఫస్టాఫ్‌లో కనిపించినంత వినోదం సెకండ్ ఆఫ్‌లో కనిపించదు. తరువాత విక్రమ్ జీవితంలో ఎదురయ్యే ఎమోషనల్ ఎపిసోడ్ సైతం కట్టిపడేస్తుంది.
ఎవరెలా చేశారు:
విక్రమ్ పాత్రలో శర్వానంద్ ఎనర్జిటిక్‌గా, చాలా అద్భుతంగా చేశాడు. హుషారైన నటనతో నవ్వించడమే కాకుండా ఎమోషనల్ సీన్లలో గుండెను బరువెక్కించాడు. కథలో కీలకమైన ఖుషి పాత్రలో విక్రమ్ ఆదిత్య నటన ఆకట్టుకుంది. సుభద్రగా కృతి తెరపై అందంగా కనిపించింది. ఈ మధ్య వచ్చిన తన సినిమాలలో మనమే సినిమాలో అద్భుతంగా ఉంది. ఇక ప్రతినాయకుడిగా రాహుల్ రవీంద్రన్ పాత్ర అంత బలంగా లేదు. అందరూ నటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.
సాంకేతిక అంశాలు:
డైరెక్టర్ శ్రీరామ్ రాసుకున్న కథను చాలా ఎంటర్టైనింగ్గా అందించారు. సెకండ్ ఆఫ్‌లో కామెడీ కొంచెం పెంచి ఉంటే బాగుండేది. ఈ చిత్రానికి హిషమ్ వాహాబ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాలో మొత్తం 16 పాటలున్నాయి. అన్ని కథలో భాగమే. విజువల్స్ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
స్టోరీ
స్క్రీన్ ప్లే
శర్వానంద్, కృతిశెట్టి యాక్టింగ్
కామెడీ, ఎమోషన్స్