NGKL: అచ్చంపేట మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలో భాగంగా స్వామివారిని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపైకి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బస్సును, భక్తుల సౌకర్యార్థం కోసం మంచి నీటి వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.