ATP: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులను రద్దీ రీత్యా రెండు స్పెషల్ రైళ్లను ఒక సర్వీస్ మాత్రమే నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెంబర్(07484) విజయవాడలో రేపు (16న) రాత్రి 7 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు ఉదయం 4:30గంలకు చేరుతుంది. అలాగే మచిలీపట్నంలో (07485) రేపు (16న) సాయంత్రం 6 గంలకు బయలుదేరి ధర్మవరంకు మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు చేరుకుంటుంది.