KDP: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుంచి తానే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్వగ్రామం కోగటంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.