KNR: సంక్రాంతి సంబరాల్లో భాగంగా చివరి రోజైన కనుమ పర్వదినాన్ని రైతులు ‘పశువుల పండుగ’గా జరుపుకుంటారు. ఈ క్రమంలో నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు ఉదయాన్నే ఎద్దులు, ఆవులకు స్నానాలు చేయించారు. అనంతరం కొత్త పగ్గాలు, మెడలో మువ్వల పట్టీలు కట్టి, కొమ్ములకు రంగులు అద్ది అందంగా ముస్తాబు చేసి పూజలు నిర్వహించారు.