అన్నమయ్య: రాష్ట్ర ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కనుమ పండుగ రైతుల కష్టానికి గుర్తింపుగా నిలుస్తుందన్నారు. గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతి కాపాడే పండుగగా కనుమ ప్రత్యేకతను మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.