BPT: బాపట్లలో మాల యువసేన ఆధ్వర్యంలో గురువారం రాత్రి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు పొందుగల చైతన్య అధ్యక్షతన ఈ నెల 26న ఉదయం 10 గంటలకు ఈ యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దళిత, బహుజన, యువత, మహిళలు వేలాదిగా తరలివచ్చి యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.