ADB: తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన ఆకుల. అశోక్ కుమారుడు అభిషేక్ ఇటీవల విడుదలైన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఫలితాల్లో CISF ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తారు. పిల్లలకు నచ్చిన రంగాన్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులు సహకరించాలని అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా అభిషేక్ ను బంధువులు, గ్రామస్థులు అభినందించారు.