SDPT: కమలాయపల్లికి చెందిన రైతు బిడ్డ వోరుగంటి శివాజీ సీఆర్పీఎఫ్ జవానుగా ఎంపికయ్యారు. వోరుగంటి రాజవ్వ-వెంకటయ్య దంపతుల కుమారుడైన శివాజీ.. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేస్తూ, ట్రాక్టర్ నడుపుకుంటూనే పీజీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి దేశసేవ చేయాలనే లక్ష్యంతో శ్రమించి ఈ ఉద్యోగం సాధించారు. గ్రామ ప్రజలు, స్నేహితులు అతడిని అభినందించారు.