సత్యసాయి: ధర్మవరంలో రెండో రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. గోమాత వ్యవసాయం, పశుసంపద, గ్రామీణ జీవనానికి ఆధారమని తెలిపారు. అనంతరం చిన్నారుల కరాటే ప్రదర్శనను తిలకించారు. చిన్న వయసులో క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో ఉపయోగకరమని అన్నారు.