NLG: కనగల్ మండలం పొనుగోడులో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం విజేతలను ఎంపిక చేసి వారికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, బహుమతులను అందజేశారు.