Sharwanand New Tag : మనం మన అభిమాన హీరోలను పేర్లకంటే ఎక్కువగా ట్యాగ్లతోనే పిలుస్తూ ఉంటాం. రెబల్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా స్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్… లాంటి టైటిళ్లను వారి పేర్లకు ముందు తగిలించేసి ఆనంద పడిపోతుంటాం. అయితే హీరో శర్వానంద్‌కు(SHARWANAND) మాత్రం ఇప్పటి వరకు అలాంటి టైటిల్ ఏమీ లేదనే చెప్పాలి. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లతో ప్రారంభించి ఇప్పుడు ఆయన హీరోగా ఎదిగారు. చూడ్డానికి పక్కింటి కుర్రాడి లాగానే అనిపిస్తారు.
అలా ఫాంలోకి వచ్చిన శర్వానంద్(SHARWANAND)కు ‘మనమే’ సినిమా నిర్మాత ఒక ట్యాగ్‌ని ఇచ్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శర్వాకి ‘ఛార్మింగ్ స్టార్’ అనే టైటిల్‌ని ఇచ్చారు. సినిమా టైటిల్ క్రెడిట్స్లోనూ ఇలాగే శర్వానంద్ పేరుకు ముందు ఛార్మింగ్ స్టార్ అనే టైటిల్‌ని వాడినట్లు ప్రకటించారు. ఈ పేరు విన్న అభిమానులంతా చాలా ఆనంద పడుతున్నారు. ఇకపై తామూ శర్వాని అలాగే సంబోధిస్తామని అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు నెట్లోనూ హల్చల్ చేస్తోంది.
శర్వానంద్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ‘మనమే’ సినిమా జూన్ ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ దీన్ని నిర్మించారు. విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండనుందని ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది.