»Krithi Shetty Manamey Movie Is A Perfect Family Film With Abundant Entertainment
Krithi Shetty : ప్రిన్సెస్ పాత్ర చేయడమే తన డ్రీమ్ రోల్ అంటున్న కృతి
శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల మందుకు రాబోతున్నారు హీరోయిన్ కృతి శెట్టి. ఈ సినిమా గురించి, తన డ్రీమ్ రోల్ గురించి ఆమె ఏమంటున్నారంటే..?
Krithi Shetty Manamey Movie : శర్వానంద్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మనమే’. ఈ జూన్ ఏడున అది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తన డ్రీమ్ రోల్ గురించి కూడా పంచుకున్నారు. బాహుబలిలో అనుష్క చేసినటువంటి ప్రిన్సెస్ పాత్రలో తనకు ఎప్పటికైనా కనిపించాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. అలాగే మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ నేపథ్యంలో ఉన్న రోల్స్ చేయాలని ఉందంటూ తెలిపపారు.
మనమే సినిమాలో తన పాత్ర గురించి కూడా కృతి శెట్టి(Krithi Shetty) మాట్లాడారు. ఇప్పటి వరకు తాను చాలాకీ అమ్మాయిలాగ, సున్నితమైన అమ్మాయిలాగ మాత్రమే పాత్రలు చేశానని అన్నారు. అయితే ఈ సినిమాలో మాత్రం అందుకు భిన్నంగా తన పాత్ర ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర పేరు సుభద్ర అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథలో ఎంతో హార్ట్ టచ్చింగ్ ఫీలింగ్స్ ఉంటాయని అందరికీ తప్పకుండా కనెక్ట్ అవుతాయని అన్నారు.
‘మనమే’ సినిమాలో(Manamey Movie ) పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఉండే అనుబంధాన్ని ఎంతో చక్కగా చూపించారని కృతి అన్నారు. జయాపజయాలు అనేవి మన చేతుల్లో ఉండవన్నారు. అందుకనే వాటి గురించి పెద్దగా ఆలోచించకూడదని తెలిపారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవడంపైనే తాను దృష్టి పెడతానంటూ చెప్పుకొచ్చారు.