»40 Killed In Landslides Flash Floods Across Northeast After Cyclone Remal
FLOODS ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు.. 40 మంది మృతి
రెమాల్ తుపాను తర్వాత కూడా ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడ వరదలు ముంచెత్తాయి. కొండ చరియలు విరిగిపడటం లాంటి ఘటనలతో ప్రజలు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
FLOODS IN NORTH EAST : ఓ వైపు ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తుంటే ఈశాన్య(NORTH EAST) రాష్ట్రాల్లో వరుణుడు భారీ వర్షాలు కురిపిస్తున్నాడు. దీంతో అక్కడ చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపుగా మూడు లక్షల మంది ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అసోంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక్క శుక్రవారమే అక్కడ వరదల కారణంగా ఆరుగురు మృతి చెందారు.
అసోంలోని మొత్తం 11 జిల్లాల్లో వరదల(FLOODS) వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు. చాలా చోట్ల రోడ్లు, రైల్వే ట్రేక్లు ధ్వంసం అయ్యాయి. దీంతో రవాణాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. అలాగే వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఆ రాష్ట్ర సీఎం హిమంత విశ్వ శర్మతో ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తమ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు.
మరో వైపు మణిపూర్‌లో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో అక్కడి రాజ్ భవన్ వరదల్లో మునిగిపోయింది. స్వయంగా గవర్నర్ రాజ్ భవన్లో ఎంత నీటి స్థాయి ఉందో కొలిచారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంఫాల్‌లో వరదల కారణంగా ముగ్గురు చనిపోయారు. వేల మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రెమాల్ తుపాను(Remal Cyclone), ఆ తర్వాత కురిసిన వర్షాలు, కొండ చరియలు విరిగి పడటం లాంటి వాటి వల్ల ఈశాన్య(NORTH EAST ) రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మొత్తం 40 మంది ప్రాణాలు విడిచినట్లు వార్తలు వెలువడుతున్నాయి.