»Brazil Floods Heavy Rain 60 Deaths Force 70000 From Homes In Rio Grande Do Sul
Brazil Floods: వరద బీభత్సం.. 60మంది మృతి.. నిరాశ్రయులైన 70వేల మంది
బ్రెజిల్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. దేశంలోని 497 నగరాల్లో కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి దయనీయంగా మారింది.
Brazil Floods: బ్రెజిల్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. దేశంలోని 497 నగరాల్లో కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి దయనీయంగా మారింది. అనేక నగరాలు నీటిలో మునిగిపోయాయి. 70,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి తాత్కాలిక టెంట్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రం ఈ ప్రకృతి వైపరీత్యానికి ఎక్కువగా ప్రభావితమైంది. ఈ రాష్ట్రంలోని పోర్టో అలెగ్రే నగరం విధ్వంసానికి కేంద్రంగా ఉంది. ఇక్కడ సరస్సులోని నీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పోర్టో అలెగ్రే జనాభా దాదాపు 1.5 మిలియన్లు.
బ్రెజిల్లో జరిగిన ఈ విధ్వంసం ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తోంది. వర్షం, వరదల కారణంగా ఇప్పటివరకు 60 మంది మరణించారు. 57 మంది అదృశ్యమయ్యారు. రెస్క్యూ టీమ్ రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉంది. అయితే రాబోయే 36 గంటల్లో భారీ వర్షం పడుతుందని హెచ్చరిక జారీ చేయబడింది. గతేడాది కూడా వర్షాలు, వరదలు రియో గ్రాండే దో సుల్లో విధ్వంసం సృష్టించాయి.
తుఫాను వల్ల ఎక్కువగా ప్రభావితమైన నగరం పోర్టో అలెగ్రే. ఈ నగరం బ్రెజిల్‌లోని పెద్ద నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో నగరంలోని రోడ్లన్నీ నదుల్లా కనిపించడంతో వాహనాలు, చెట్లు, మొక్కలు అన్నీ నీట మునిగాయి. ఇక్కడ సరస్సు, రిజర్వాయర్‌లోని నీరు గట్లను విరగ్గొట్టి నగరంలోకి ప్రవహిస్తోంది. పోర్టో అలెగ్రేలో తుఫాను, కుండపోత వర్షాల దృష్ట్యా, విమానాశ్రయం నుండి విమాన కార్యకలాపాలు నిలిపివేశారు.