»Polavaram Will Be Completed In Two Years If Modi Wins Chandrababus Center In Ap Amit Shah
Amit Shah: ఏపీలో చంద్రబాబు కేంద్రంలో మోడీ గెలిస్తే రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి
ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో వస్తే ఆగిపోయిన పోలవరం పూర్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పేర్కొన్నారు. రాయలసీమను నిర్లక్ష్యం చేశారని కేంద్రంలో మోడీ అధికారంలో వస్తే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తామని తెలిపారు.
Polavaram will be completed in two years if Modi wins Chandrababu's center in AP.. Amit Shah
Amit Shah: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి పాలనకు, గుండాగిరికి, భూకబ్జాలకు స్వస్థి చెప్పే సమయం వచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పేర్కొన్నారు. అంతే కాదు ఏపీలో కూటమిని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రెండు సంవత్సరాల్లో పోలవరం(Polavaram) ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందిస్తామని అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రచారంలో పాల్గొన్న అమిత్షా అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. కూటమి అభ్యర్థులు తరఫున అమిత్షా, చంద్రబాబు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన తరువాత అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడితే జగన్ (YS Jagan) అన్నింటిని నాశనం చేశారని అని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. ఇప్పటికే దాదాపు రూ. 13 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు. ల్యాండ్, ఇసుక మాఫియా చేసేవారు బాగుపడ్డారు అని ఇక రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అమిత్ షా విమర్శించారు. ఇక కూటమి అధికారంలో వస్తే.. అమరావతి (Amaravati) ని పూర్తి చేసి, రాజధానిగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు సామర్థ్యం గురించి అందరికీ తెలిసిందే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను అభివృద్ది చేయలేదా అని అన్నారు. ఇకపై ఏపీకి అన్ని మంచిరోజులే అని వ్యాఖ్యానించారు.