AKP: సబ్బవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఇవాళ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పద్మజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. ఎంపీటీసీలు సర్పంచ్ లకు ఆహ్వానాలు అందజేసినట్లు పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు.