ప్రకాశం: ఒంగోలులోని కలెక్టరేట్లో ఈనెల 8న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, అర్జీల స్థితిగతులను అర్జీదారులు కాల్ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కానివారు వాటి స్లిప్పులను తీసుకురావాలన్నారు.