AP: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 9 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 12 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు, రూ.500 అపరాధ రుసుంతో 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.