నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో రహస్యంగా పేకాట స్థావరం ఏర్పాటు చేశారు. పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి సీఐ సాంబశివరావు తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం స్టేషన్కు తరలించారు. నిందితుల నుంచి రూ.23వేలు స్వాధీనం చేసుకోగా.. పట్టుబడిన వారిలో ఓ మహిళ సైతం ఉన్నారు.