సత్యసాయి: పుట్టపర్తిలోని చిత్రావతి నది హారతి ఘాట్ వద్ద సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల సందర్భంగా నాటిన మొక్కల సంరక్షణను అధికారులు విస్మరించారు. ప్రస్తుతం ఈ మొక్కలు నీరు లేక వాడిపోతున్నాయి. పచ్చదనం, పరిశుభ్రతపై అధికారులు నిర్లక్ష్యం తగదని, మొక్కల సంరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.