విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. వెంకీ బర్త్ డే సందర్భంగా ఈ నెల 13న ఈ చిత్రం టైటిల్ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ‘బంధు మిత్రుల అభినందనలతో’ అనే పేరుతో పాటు మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.