TG: తెలంగాణలో ట్రంప్ మీడియా టెక్నాలజీస్ భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ట్రంప్ మీడియా టెక్నాలజీస్ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు. వచ్చే పదేళ్లలో రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతామని ఎరిక్ తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు ప్రకటన చేశారు.