ASR: అనంతగిరి పంచాయతీ పరిధిలో రింగ్ రోడ్డు, వంతెన పనులు ఏళ్లుగా నిలిచిపోయాయి. దీంతో పెద్దూరు-మాలింగవలస-పాతకోట మార్గంలో రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. మెటల్ రోడ్డు తుఫాన్ కారణంగా దెబ్బతిని గోతులు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాతకోటలో ఏకలవ్య పాఠశాల నిర్మాణ సామగ్రి కూడా ఈ రోడ్డుగానే తరలిస్తుండటంతో సమస్యలు మరింత పెరిగాయి.