KMR: మున్సిపల్ అథారిటీ లేకుండా అనధికార మ్యాప్ చూపించి చిరు వ్యాపారులను ఆగం చేయవద్దని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నూతన మడిగెలు పూర్తయ్యాకే వారిని తరలించాలని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న మడిగెలు ఖాళీ చేసే అంశంపై నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.