చిత్తూరు: వీ. కోట ముదిమడుగు గ్రామంలో సోమవారం పదో తరగతి విద్యార్థిని అనుశ్రీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను గమనించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.