MDK: చిన్న శంకరంపేట మండలం గవ్వల పల్లిలోని శ్రీ మహాగణపతి పంచాయతీ దేవాలయ నాలుగో వార్షికోత్సవ ఉత్సవాలు ఉదయం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా కలశపూజ హోమం శివ పార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఒడి బియ్యం సమర్పించుకొని భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.