GNTR: జిల్లా కేంద్రంలోని మణిపురం బ్రిడ్జి సమీపంలో పైపులైన్ రోడ్డు, వార్డు నెం. 15 పరిధిలో చేపట్టిన కల్వర్టులు, కాలువ నిర్మాణ పనులు గత మూడు నెలలుగా అలస్యంగా జరుగుతున్నాయి. దీనివల్ల కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసంపూర్తిగా ఉన్న ఈ పనుల కారణంగా రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు.