ATP: అనంతపురంలోని తపోవనం బ్రిడ్జిపై రాజకీయ నేతలు నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఫ్లెక్సీలు సోమవారం సాయంత్రం కిందపడ్డాయి. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న ఇద్దరిపై ఫ్లెక్సీలు పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు వారికి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.