WGL: పర్వతగిరి జిల్లా పరిషత్ హైస్కూల్, రోల్లకల్ యూపీ పాఠశాల రాష్ట్రస్థాయి ‘హరిత ఏవం స్వచ్ఛ విద్యాలయ పురస్కార్’ (SHVR) పోటీలకు ఎంపికయ్యాయి. సకల సౌకర్యాలు కలిగిన పాఠశాలల విభాగంలో జిల్లాలోని 8 పాఠశాలల్లో ఒకటిగా నిలిచి రాష్ట్రస్థాయికి చేరాయి. మధ్యాహ్న భోజనం, టాయిలెట్స్, పరిశుభ్రతలో ఉత్తమ ప్రమాణాలతో ఈ ఘనత సాధించాయి. ఎంఈవో లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.