విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె.కె. రాజు తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు కఠారి అనిల్ కుమార్ రాజు, అంబటి శైలేష్ తదితరులు పాల్గొన్నారు.