ASR: కేరళ త్రిసూరులో జరిగిన అస్మిత ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో డుంబ్రిగూడ (M) బోడిగుడ గ్రామానికి చెందిన గిరి విద్యార్థిని గొల్లోరి లెనిన్ ప్రియ రజతం సాధించింది. 58 కేజీ విభాగంలో మెరిసిన ఆమె ప్రస్తుతం కడప జిల్లా పుట్టంపల్లిలోని వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. విజయం సాధించడం పట్ల గ్రామస్తులు ఆమెకు అభినందనలు తెలిపారు.