SRPT: కర్ల రాజేష్ పోలీసుల చిత్రహింసలతోనే దుర్మరణం పాలయ్యాడని, ఆయన మృతికి కారణమైన పోలీసులను అరెస్టు చేసేంత వరకు దశల వారీగా ఉద్యమాలు చేస్తామని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సోమవారం కోదాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఒత్తిడో లేక మరే కారణమో కానీ దోషులను కాపాడుకునేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు.