NRPT: మద్దూరు పట్టణంలో మెయిన్ రోడ్ విస్తరణకు ఏడాదిన్నర గడిచినా డివైడర్లు, సెంటర్ లైట్స్ ఇంకా ఏర్పాటు కాలేదు. దీంతో ట్రాఫిక్ ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు రద్దీ సమయంలో లైట్లు లేకపోవడం అసౌకర్యంగా మారిందని పేర్కొంటూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.