ప్రకాశం: బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలో నామ్ ఫౌండేషన్ నిర్మిస్తున్న నూతన చెక్ డ్యాం పనులను స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ రూ.80 లక్షలతో చెక్ డ్యామ్ నిర్మించడం అభినందనీయమని, గ్రామాల అభివృద్ధికి ఆయన ఫౌండేషన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే కొనియాడారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.