కడప: గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై కడప పోలీసులు ఉక్కుపాదం మోపారు. సోమవారం కడప టూ టౌన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టారు. మార్కెట్ యార్డ్, అల్మాస్ పేట, దేవుని కడప చెరువు కట్ట ప్రాంతాల్లో సోమవారం విస్తృత దాడులు చేశారు. బహిరంగంగా మద్యం తాగినా, గంజాయి వాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.