సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినీ జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికయ్యింది. జాతీయ సేవ పథకం NSS 4వ యూనిట్ నుంచి తృతీయ సంవత్సరం చదువుతున్న రాజ్ పేట వర్ష జాతీయ సమైక్యత శిబిరం కుత్బుల్లాపూర్ హైద్రాబాద్‌కు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.జి. సునీత తెలిపారు. ఈ సందర్బంగా సోమవారం వర్షను అభినందించారు.