NTR: ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం సోమవారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ క్రమంలో 82 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. అందిన ఫిర్యాదుల్లో భూవివాదాలకు, ఆస్తి వివాధాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 46, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 2 ఇలా మొత్తం 82 ఫిర్యాదులు ఉన్నాయన్నారు.