జపాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో జపాన్ ఈశాన్య తీరంలో మూడు మీటర్ల ఎత్తుతో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. అమోరి ప్రిఫెక్చర్ తీరానికి 80 కి.మీ దూరంలో, 50 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు సదరు ఏజెన్సీ తెలిపింది.