PLD: సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో 10 కంపెనీలు పాల్గొంటాయని, అర్హతను బట్టి నెలకు రూ.35 వేల వరకు జీతం లభిస్తుందన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని, ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.