GDWL: కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని గోదాములో ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ సంతోష్ సోమవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలో భాగంగా ఆయన ఈ తనిఖీ చేపట్టారు. సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన స్ట్రాంగ్ రూమ్ భద్రత నిర్వహణను పరిశీలించారు.