చైనాకు మీదుగా రాకపోకల సమయంలో భారత పౌరులు జాగ్రత్తగా వ్యవహరించాలని విదేశాంగశాఖ సూచన జారీ చేసింది. చైనా విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని చైనా హామీ ఇస్తుందని ఆశిస్తున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధిర్ జైస్వాల్ వెల్లడించారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళను చైనా నిర్భంధించిన విషయం తెలిసిందే.