W.G: నరసాపురం (M) సీతారామపురం రాజులపాలెంలో ఓవర్ హెడ్ ట్యాంక్ కింద నిర్మించిన సత్తెమ్మ గుడి, ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు వచ్చిన దగ్గర నుంచి గ్రామానికి చెందిన కొంతమంది తనను చంపుతానని బెదిరిస్తున్నట్లు చెరుకూరి సత్యవర ప్రసాదరాజు సబ్ కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ లో ఆర్డివో దాసిరాజుకు ఫిర్యాదు చేశారు.